RCB ఆటగాళ్లకు విరాట్ సీరియస్ వార్నింగ్

inner-page-banner

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏ మాత్రం అదృష్టం లేని టీమ్ ‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మూడు సీజన్లు ఫైనల్ చేరినా.. చివరి మెట్టుపై తడబాటుకు గురై రన్నరప్‌ లతో సరిపెట్టుకుంది. ఐపీఎల్ 2020  లో తాము చేసే ఒక్క చిన్న తప్పిదం టోర్నమెంట్‌లో టీమ్ తలరాతనే మార్చేస్తుందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్సీబీ సహచరులకు కెప్టెన్ విరాట్ కోహ్లీ   సూచించాడు. ఓ రకంగా చెప్పాలంటే ఆట పరంగా, ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలని జట్టు సభ్యులను కోహ్లీ హెచ్చరించాడు.

  
Also Read: ఐపీఎల్ 2020 : అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన జియో !

ఆర్సీబీ టీమ్ సోమవారం ఆన్‌ లైన్‌ మీటింగ్‌ లో పాల్గొంది. బయో బబుల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ విషయంలోనూ రాజీ పడకూడదని కోహ్లీ పేర్కొన్నాడు. ఒక్కరు చేసే తప్పిదం కారణంగా మొత్తం ఆర్సీబీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, బీ కేర్‌ఫుల్ అంటూ హెచ్చరించాడు. ప్రొటోకాల్స్ తప్పనిసరి పాటించాలని, తద్వారా టోర్నీని విజయవంతంగా ముగించవచ్చునని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.  దుబాయ్ చాలా సురక్షితమైన ప్రాంతమని, ఆటగాళ్లు క్వారంటైన్‌లో జాగ్రత్తలు పాటించాలని.. ప్రతి ఒక్కరికి సమాన బాధ్యతలు ఉన్నాయని గుర్తుచేశాడు. ఈ ఏడాది దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా యూఏఈ ఐపీఎల్ 2020కు ఆతిథ్యమిస్తోంది. 


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube