ధోని , రోహిత్ , విరాట్ లకు డోపింగ్ పరీక్షలు

inner-page-banner

ఇండియన్ ప్రీమియర్ లీగ్  లో ప్రాతినిథ్యం వహించే క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు చేసేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ డోపింగ్ నిరోధక సంఘం ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా మొత్తం 50 మంది స్టార్ క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించనున్నారు.   అంతర్జాతీయ, జాతీయ స్థాయి తరహాలో ఐపీఎల్‌లోనూ నిజాయితీగా ఆట జరగాలని, ఆటగాళ్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకూడదని నాడా డోపింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 2020 జరిగే దుబాయ్, షార్జా, అబుదాబి వేదికలలో మూడు డోప్ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మరో రెండు కేంద్రాలను ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  గతంలో తరహాలో కాకుండా ఆటగాళ్ల మూత్రం (యూరిన్)తో పాటు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు డోప్ టెస్టుల కోసం ఐదుగురు సభ్యులు ఉండే మూడు టీమ్‌లను నాడా నియమించనుంది. కాగా, ఐపీఎల్ 13వ సీజన్ జరిగే సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 మధ్యకాలంలో మొత్తం విడతలవారీగా డోపింగ్ టెస్టులు చేయనున్నారు.   

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube