ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ .. భారీ భద్రత ఏర్పాటు !

inner-page-banner


బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసారు. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఎమ్మెల్యే  రాజాసింగ్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది . హిట్ లిస్టులో రాజాసింగ్ పేరు ఉండటంతో అలర్ట్ అయిన తెలంగాణ పోలీసులు, రాజాసింగ్ ఇంటి వద్ద అధునాతన ఆయుధాలతో భద్రత కల్పిస్తున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ ఇంటివద్ద అ భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు హైదరాబాద్ కమిషనర్. అలాగే , ఆయన్ని  గతంలో మాదిరిగా టు వీలర్ వాహనంపై తిరుగవద్దంటూ  తెలిపారు. గతంలో మాదిరిగా పరిస్థితులు లేవని జాగ్రత్తగా ఉండాలంటూ రాజాసింగ్‌కు పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలని పోలీసులు కోరారు.


Also Read: దేశం లో కరోనా కలకలం .. భారీగా పెరుగుతోన్న కేసులు, మరణాలు , కొత్తగా ఎన్నంటే !

ఈ విషయాలను తెలుపుతూ ప్రత్యేకంగా లేఖను రాజాసింగ్ ‌కు సౌత్ జోన్ డీసీపీ అందజేశారు. డిసిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాజా సింగ్ భద్రతా పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఇక , పోలీసులు అందజేసిన లేఖ పై స్పందించిన బీజేపీ  ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు ఎవరి ద్వారా ప్రాణహాని ఉందో పోలీసులు స్పష్టం చేయాలన్నారు. టెర్రరిస్టుల నుండి ఉందా , లేదా స్థానికంగా ఉండే ఏదైనా సంస్థల నుండి ఉందో స్పష్టం చేయాలని కోరారు.  ఈ విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు రాష్ట్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. తన ఇంటి పరిసరాలలో అద్దెకు ఉంటున్న వారి వివరాలను సేకరిస్తున్నారని... పోలీసులు తన సిబ్బందికి ఆయుధాలను కూడా మార్చారని రాజాసింగ్ తెలిపారు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube